MLA Gudem Mahipal Reddy : ఎమ్మెల్యే గూడెంకు సొంత పార్టీల నేతల షాక్

MLA Gudem Mahipal Reddy : ఎమ్మెల్యే గూడెంకు సొంత పార్టీల నేతల షాక్
X

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. IDA బొల్లారంలో మహిపాల్ రెడ్డిని అడ్డుకున్నారు ఆ పార్టీ నాయకులు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు గూడెం మహిపాల్ రెడ్డి. అయితే శిలాఫలకాల పై కొంతమంది పేర్లు లేకపోవడంతో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించడం లేదని కొంతమంది నేతల ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసి కొంతమంది నేతలు వెళ్లిపోయారు. బొల్లారం కాంగ్రెస్ లో మొదటి నుండి వర్గ పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కార్యక్రమాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం.

Tags

Next Story