TG : సీఎం రేవంత్‌వి టార్గెట్ పాలిటిక్స్.. ఎమ్మెల్యే కృష్ణారావు ఫైర్

TG : సీఎం రేవంత్‌వి టార్గెట్ పాలిటిక్స్.. ఎమ్మెల్యే కృష్ణారావు ఫైర్
X

తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ కుటుంబాన్ని కుట్రపూరితంగా ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జన్వాడ ఫామ్ హౌస్‌లో జరిగిన పోలీసుల రైడ్స్‌పై కృష్ణారావు స్పందించారు. కేంద్ర మంత్రి అయ్యుండి బండి సంజయ్ ప్రజా సమస్యలపై స్పందించకుండా కేవలం ఇలాంటి తప్పుడు ప్రచారాలపై స్పందించి ప్రజలకు ఏం చెబుతున్నారని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్‌ను సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కనీసం ఇంట్లో కూర్చుని ఫంక్షన్ చేసుకునే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో చుట్టాలు కలిస్తే మద్యం దావత్ చేసుకోవాలంటేనే భయపడుతున్నారని సెటైర్లు వేశారు.

Tags

Next Story