పెళ్లిళ్లున్నాయన్న మల్లారెడ్డి.. సెలవు కోసం అభ్యర్థన

పెళ్లిళ్లున్నాయన్న మల్లారెడ్డి.. సెలవు కోసం అభ్యర్థన

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) మళ్లీ వార్తల్లోకి వచ్చారు. సవాళ్లు, సినిమా డైలాగులు చెప్పడంలో మల్లారెడ్డికి ఏ లీడర్ కూడా సాటే లేరు. కష్టపడ్డా డైలాగుతో ఆయన ట్రెండ్ సెట్ చేశారు. తనదైన పంచ్ డైలాగులతో వెరైటీ టైమింగ్ తో పొలిటికల్ హీట్ నెస్ తో పాటు.. కామెడీని కూడా తెగ పండిస్తుంటారు మల్లారెడ్డి.

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద రావుకు సోమవారం నాడు ఓ ఆసక్తికర విన్నపం చేశారు. కృష్ణా ప్రాజెక్టుకు, కేఆర్ఎంబీకి సంబంధించిన అంశాలపై సభలో చర్చ జరుగుతున్న టైంలో.. సభాపతికి ఓ విజ్ఞప్తి చేశారు. "ఒక్కటే విషయం. ఒక్కటే సెకండ్. ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నారు. 14, 15 తేదీల్లో వసంత పంచమి ఉంది. ఆ రోజున 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి. కాబట్టి సభ్యులందరి కోరిక మేరకు ఆ రెండు రోజులు అసెంబ్లీని నడపొద్దు.. సెలవు ఇవ్వాలని సభాపతిని కోరుతున్నాను" అన్నారు.

మల్లారెడ్డి చేసిన విజ్ఞప్తితో సభ్యులంతా పగలబడి నవ్వారు. మల్లారెడ్డి కోరింది కూడా కరెక్టే అనే వాదన వినిపించింది. ఆ రోజు వేలాదిగా పెళ్లిళ్లు ఉండటంతో.. ఎవరికి వారు బిజీగా ఉంటారని సభ్యులు చెప్పుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story