TG : ఫామ్ హౌస్ లో కోడి పందేల కేసు .. ఎమ్మెల్సీ పోచంపల్లికి మరోసారి నోటీసులు

ఫామా హౌస్ కోడి పందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరోసారి మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందుకు సంబంధించి రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మాదాపూర్లోని పోచంపల్లి నివా సానికి వెళ్లి ఇవాళ నోటీసులు అంటించారు. గత నెలలో సిటీ శివారు మొయినాబాద్లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్ కు చెందిన ఫామాస్లో కోడి పందేలు, కేసినో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివా స్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేసులో మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ఓనర్ పోచంపల్లి ని సైతం నిందితుడిగా చేర్చారు. ఫామ్ హౌస్ లీజుకు ఇచ్చానని గతంలో లాయర్ ద్వారా పో లీసులకు పోలీసులకు పోచంపల్లి తెలిపారు. ఈక్రమంలో గత నెల 13న మొయినాబాద్ పోలీసులు మొదటిసారి పోచంపల్లికి నోటీ సులిచ్చారు. తాజాగా రెండోసారి నోటీసుల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com