MLA Prem Sagar Rao : మంత్రి పదవి ఆశిస్తున్నా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

కాంగ్రెస్ పార్టీలో తాను చాలా సీనియర్‌ను అని, తాను మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదు అని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలతో పాటు పార్టీకి సంబంధించి పలు రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. సీనియర్‌గా మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పుకుండా ఒకరోజు గుర్తింపు వస్తుందని అన్నారు. మహేశ్ కుమార్ గౌడ్‌కు పీసీసీ చీఫ్ పదవి కూడా అలాగే వచ్చిందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, వెడ్మ బొజ్జు నియోజకవర్గ ఇంఛార్జిలు శ్రీహరిరావు, కంది శ్రీనివాస రెడ్డి, ఆడె గజేందర్, రావి శ్రీనివాస్, శ్యాంనాయక్, నారాయణ్ రావు పాటిల్, సీనియర్ నాయకులు వేణు గోపాల చారి పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com