Jani Master : జానీ బాషాను కఠినంగా శిక్షించాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లవ్ జిహాదీకి పాల్పడిన జానీ బాషాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జానీ మాస్టర్ వ్యవహారంపై స్పందించిన రాజాసింగ్ మాట్లాడుతూ.. జానీ బాషా అరెస్ట్ ఎందుకు ఆలస్యమవుతోంది?. జానీని త్వరగా అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. ఇప్పటి వరకు అతడు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి చేశాడో బయటపెట్టించాలి. ఒక దొంగకి, ఒక రౌడీకి, ఒక హంతకుడికి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారో అదే విధంగా అతడికి కూడా ట్రీట్‌మెంట్ ఇవ్వాలని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. లవ్ జిహాదీకి పాల్పడిన జానీ బాషాను కఠినంగా శిక్షించాలి. టాలీవుడ్‌చిత్ర పరిశ్రమకు జానీ బాషా మచ్చ తెచ్చాడు. ఇలాంటి వారి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన ప్యానల్ సీరియస్‌గా వ్యవహరించాలి. ఇండస్ట్రీలో ఇలాంటి వారు మళ్లీ అడుగుపెట్టకుండా ప్యానల్ కఠిన చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com