TG : సీఎం రేవంత్ రెడ్డి సూపర్ : ఎమ్మెల్యే రాజాసింగ్

TG : సీఎం రేవంత్ రెడ్డి సూపర్ : ఎమ్మెల్యే రాజాసింగ్
X

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సూపర్ అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు సీఎంకు రాజాసింగ్ థాంక్స్ చెప్పారు. మంగళవారం నగరంలో గణేశ్ నిమజ్జనం కోసం ప్రభుత్వ ఏర్పాట్లపై రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. బాలాపూర్ గణేశ్ నిమజ్జనం శోభాయాత్రలో పాల్గొన్న రాజాసింగ్ ఈ సందర్భంగా ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ.. ఈ సారి ప్రభుత్వంలోని వ్యవస్థలు చాలా బాగా పని చేశాయన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పనితీరు బాగుందన్నారు. ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈసారి సీఎం, ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడం సంతోషకరం అన్నారు. అలాగే ఖైరతాబాద్ గణేశ్ మండపాన్ని సైతం సీఎం దర్శించారని గుర్తు చేశారు. ఎండ కారణంగానే నిమజ్జనాలు కొంత ఆలస్యం జరుగుతున్నాయని అన్ని ఏర్పాట్లు, వ్యవస్థలు బాగున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.

Tags

Next Story