MLA Shakeel : 'యాక్సిడెంట్ చేసిన కారు నాది కాదు'.. జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్

X
By - TV5 Digital Team |18 March 2022 5:15 PM IST
MLA Shakeel : జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై స్పందించారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. ఆక్సిడెంట్ చేసిన కారు తనది కాదని, తన బంధువు మీర్జాది అన్నారు.
MLA Shakeel : జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై స్పందించారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. ఆక్సిడెంట్ చేసిన కారు తనది కాదని, తన బంధువు మీర్జాది అన్నారు. అప్పుడప్పుడు ఆ కారును తాను ఉపయోగిస్తుంటానని అందుకే ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించినట్లు వెల్లడించారు. కారు నడిపింది.... తన బంధువైన మీర్జా కుమారడన్నారు. ప్రమాదం తర్వాత ఆ మహిళే పాపను కిందపడేందని, అలా పడేయడంతోనే.. చిన్నారి చనిపోయినట్లు తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మీర్జా కుటుంబానికి చెప్పానన్న షకీల్.... పోలీసులు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవర్‌ను అక్కడి వాళ్లు కొట్టడంతో అంతా పారిపోయినట్లు వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com