MLC Kavitha : సీఎం రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత విసుర్లు

MLC Kavitha : సీఎం రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత విసుర్లు
X

సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సెల్ లా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కేసీఆర్ శత్రువు అని సీఎం అనుకుంటున్నారని, కానీ మన జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులు మన శత్రువులనే విషయాన్ని ఆయన గమనించాలన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 'నీళ్లు - నిజాలు' అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. నీళ్ల మీద రేవంత్ ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని, రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని సూచించారు. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్య శ్రీని కేసీఆర్ కొనసాగించారని, కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోందని, అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలన్నారు. ఆంధ్ర కేడర్లో పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్ ను బాధ్యతల నుంచి తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. కృష్ణ ట్రిబ్యునల్ లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భు తమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని, కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశారని గుర్తు చేశారు.

Tags

Next Story