MLC Kodandaram : పదేళ్లలో నిరుద్యోగ సమస్యకు పరిష్కరించలేదన్న ఎమ్మెల్సీ కోదండరామ్

MLC Kodandaram : పదేళ్లలో నిరుద్యోగ సమస్యకు పరిష్కరించలేదన్న ఎమ్మెల్సీ కోదండరామ్
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల వరకు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగులు ఆ తర్వాత నిరాశకు గురయ్యారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం తోనే ఉద్యమం సాగిందని చెప్పారు. 2లక్షల కు పైగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 50వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ అయినట్లు చెప్పారు. విద్య ప్రైవేటీకరణ కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రాథమిక విద్య 65 శాతం మేర ప్రైవేటు రంగంలోనే కొనసాగడం నష్టం చేస్తుందన్నారు. అదే విధంగా డిగ్రీ విద్య 80శాతం ప్రైవేటు రంగంలోనే ఉందన్న కోదండరామ్.. దేశంలో విద్యపై తల్లిదండ్రులు ఎక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ తయారైందన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం శుభ పరిణామంగా చెప్పారు.

Tags

Next Story