MLC Mahender Reddy: సీఐ రాజేందర్‌ను బెదిరించిన ఆడియో నాది కాదు- మహేందర్‌రెడ్డి

MLC Mahender Reddy: తాండూర్ సీఐపై అనుచిత వ్యాఖ్యల ఆడియో క్లిప్ వైరల్ అవడంతో.. మీడియా ముందుకొచ్చారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి. సీఐ రాజేందర్‌ను బెదిరించిన ఆడియో తనది కాదన్నారు. పోలీసులంటే తనకు అపార గౌరవమని.. లోకల్‌గా పడని కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఇక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెెడ్డి అరాచకాలు తాండూర్‌లో ఎవర్నడిగినా చెబుతారన్నారు మహేందర్‌రెడ్డి. ఇక అన్ని విషయాలు కోర్టులోనే తేల్చుకుంటానన్నారు.
మరోవైపు పట్నం బూతు పురాణంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీఐ రాజేందర్‌రెడ్డి.. లాంగ్ లీవ్‌లో వెళ్లారు. ఇక ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి బూతులు తిట్టడం బాధ కలిగించిందన్నారు. పట్నంపై కేసు నమోదైందని.. అన్ని విషయాలు విచారణలో బయట పడుతాయన్నారు. ఇసుక అక్రమ దందాపై వివరాలుంటే పట్నం మహేందర్‌రెడ్డి బయటపెట్టొచ్చన్నారు. అలాగే తాండూర్‌లో రౌడీషీటర్లు ఎవరో కూడా ఆయనే చెబితే బాగుంటుందన్నారు సీఐ రాజేందర్‌రెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com