MLC Mahender Reddy: సీఐపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బూతు పురాణం..!

MLC Mahender Reddy : తాండూర్ సీఐపై TRS ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతు పురాణం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఐ రాజేందర్ రెడ్డిపై అభ్యంతరకర, అసభ్యకరమైన తిట్లతో రెచ్చిపోయారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నావంటూ ఫైర్ అయ్యారు. సీఐ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు.
తాండూర్‌లో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మహేందర్ రెడ్డి...కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక అప్పటినుంచి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోహిత్‌కు వత్తాసు పలుకుతున్నాడంటూ సీఐపై బూతులతో విరుచుకుపడ్డారు మహేందర్ రెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com