Modi: 6109 కోట్ల విలువైన పనులకు శ్రీకారం..

ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో 6109 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. 511 కోట్లతో రైలు వ్యాగన్ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో పాటు జగిత్యాల-వరంగల్ ఎన్‌హెచ్ పనులకు, మంచిర్యాల-వరంగల్ ఎన్‌హెచ్ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం తన తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ దేశాభివృద్ధిలో తెలంగాణది కీలకపాత్ర అన్నారు. తెలుగు వారి ప్రతిభ దేశసామర్థ్యాన్ని పెంచిందన్నారు. ఆర్థికవృద్ధి లోనూ తెలంగాణది ప్రధాన భూమిక అన్నారు. తెలంగాణ వికాసం కోసం చర్యలు చేపట్టామని తెలిపారు.
అంతకు ముందు భద్రకాళి ఆలయానికి రోడ్డుమార్గంలో చేరుకున్న ప్రధాని మోదీకి, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోశాలలో కలయ తిరిగిన ప్రధాని గోవులకు గ్రాసం తినిపించారు. ఆలయ ఆవరణలో గోసేవలో పాల్గొన్న ప్రధానికి వేదపండితుల ఆశీర్వచనం అందించారు. పూజల అనంతరం విజయసంకల్ప సభకు వెళ్లారు.విజయ్ సంకల్పసభలో ప్రధానితో పాటు కేంద్రమంత్రి గడ్కరీ, గవర్నర్ తమిళిసై, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. సభా ప్రాంగణం నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మోదీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com