Minister Ponnam : జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి సరికాదు : మంత్రి పొన్నం

Minister Ponnam : జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి సరికాదు : మంత్రి పొన్నం
X

జల్‌పల్లిలో జర్నలిస్ట్‌పై సీనియర్ నటుడు మోహన్ బాబు చేసిన దాడి సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. జర్నలిస్టుల పట్ల అహంకార పూరితంగా వ్యవహరించిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. రిపోర్టర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ దాడి ఘటన పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Tags

Next Story