Vikarabad : బావిలో దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య.. కూతురు అరుపులు విని!

వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బావిలో దూకి తల్లీ,కొడుకూ ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్ జిల్లాలోని నవాబు పేట మండలంలో ఉన్న గేటు వనంపల్లిలో ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లి అరుంధతి.. తన కొడుకు రిత్విక్, కూతురు ప్రజ్వలతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్ళింది. అయితే కూతురు ప్రజ్వల "అమ్మా... నన్ను బావిలో తోసేయకు.." అంటూ పెద్దగా కేకలు పెడుతూ ఏడ్చింది. దీంతో ప్రజ్వలను ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది అరుంధ. బావి దగ్గర తల్లి వ్యవహారం చూసి పది సంవత్సరాల కూతురు ప్రజ్వల గట్టి గట్టిగా కేకలు వేసింది. ఎవరితోనే ఫోనో లో గుడ్ బై అని చెప్పి... వెంటనే తల్లి అరుంధ తన కొడుకు రిత్విక్ ను బావిలో తోసేసి అనంతరం తాను బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కూతురు ప్రజ్వల అరుపులు విని స్థానికులు అక్కడికి వచ్చి.. బావిలో దూకి అరుంధ, రిత్విక్ ను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ వారు అప్పటికే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com