Mahbubnagar : రేబీస్ సోకిందనే అనుమానంతో కూతురిని చంపి తల్లి ఆత్మహత్య

రేబిస్ వ్యాధి సోకిందన్న అనుమానంతో తల్లి తన కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో చోటు చేసుకుంది. యశోద, నరేశ్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. యశోద గత కొంత కాలంగా అనారో గ్యంతో బాధ పడుతోంది. అయితే తనకు రేబిస్ వ్యాధి సోకిందనే అనుమానంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. ఆమె రేబిస్ వాక్సిన్ తీసుకున్నప్పటికీ అది వ్యాక్సిన్తో తగ్గదని, చెట్ల మందు తీసుకోవాలంటూ భర్తకు చెప్పేది. నిన్న ఉదయం భర్త డ్యూటీకి వెళ్లగానే కుమారుడు జాగ్రత్త అంటూ బోర్డుపై రాసి బెడ్రూంలోకి వెళ్లి కూతురిని గొంతు నులిపి చంపింది. ఆపై తానూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే భర్త ఇంటికి ఫోన్ చేయగా కుమారుడు లిఫ్ట్ చేసి అమ్మ బెడ్రూంలోంచి బయటికి రావట్లేదని చెప్పాడు. దాంతో అనుమానించిన భర్త పక్కింటి వారికి సమాచారం ఇవ్వగా వారి వచ్చి చూసే సరికి బెడ్రూంలో యశోద ఉరేసుకొని కనిపించింది. ఆమె కూతురు అక్షర బెడ్రూం లోనే మృతి చెంది పడి ఉంది. తాము ఆరు బయట పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఆరబెట్టినప్పుడు కుక్కలు ఎంగిలి చేశాయని, తమకు తెలియక పోవడంతో వాటిని వంటల్లో ఉపయోగించిన ట్లు నరేశ్ తెలిపారు. దాంతో తమకు చర్మవ్యా ధులు రాగా వాటిని రేబిస్ గా భావించి భార్య మానసికంగా కుమిలి పోయేదని పేర్కొన్నారు. అది రేబిస్ కాదని తాను, యశోద తండ్రి సైతం అనేక మార్లు నచ్చచెప్పినా ఆమె నమ్మలేదని పేర్కొన్నాడు
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com