Missing : వ్యాక్సిన్ కోసం వచ్చి తల్లీబిడ్డలు అదృశ్యం

హాస్పిటల్‌లో కుమార్తెకు వ్యాక్సిన్ వేయించేందుకు వచ్చిన వివాహిత తన కుమార్తెతో కలిసి అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌కు చెందిన కాజా ఇలియాజ్ అహ్మద్ అనే వ్యక్తి ఈనెల 21న సోదరి నిషా ఫిర్‌దౌస్‌తో కలిసి ఆమె నాలుగేళ్ల కుమార్తెకు వ్యాక్సిన్ వేయించేందుకు బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. సోదరి నిషా ఫిర్‌దౌస్‌ను, ఆమె కుమార్తెను గేటు వద్ద దింపిన ఇలియాజ్ కారు పార్కింగ్ చేసేందుకు సెల్లార్‌లోకి వెళ్లాడు. కాసేపటికి కారు పార్క్ చేసి వచ్చిన తర్వాత సోదరి నుంచి తాను వాష్‌రూమ్‌లో ఉన్నానంటూ మెసేజ్ వచ్చింది. దాంతో ఆమె కోసం వేచి ఉండగా ఎంతసేపటికి తిరిగిరాకపోవడంతో హాస్పిటల్ మొత్తం గాలించాడు.దాంతో తెలిసిన వారికి ఫోన్లు చేయడంతో పాటు అన్ని చోట్లా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com