MP Chamal Kiran Kumar Reddy : 100 శాతం అటెండెన్స్ లో ఎంపీ చామల ఫస్ట్

లోక్ సభ సమావేశాలకు 100 శాతం హాజరైన ఘనత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. నిత్య విద్యార్థిగా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచారు. భువనగిరి, ఆలేరు, జనగాం, రాయిగిరి, యాదాద్రికి సంబంధించిన పలు సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించారు. పార్లమెంట్ సమావేశాలకు తెలంగాణ ఎంపీల హాజరు శాతం, అడిగిన ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనటం పై ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. జూన్ 2024 నుంచి 4 ఏప్రిల్ 2025 మధ్య పార్ల మెంట్ సమావేశాలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 100 శాతం హాజర య్యారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ కొండా విశ్వే శ్వర్ రెడ్డి 95 శాతం హాజరు నమోదైంది. మరో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు వేసి 91 శాతం సమావేశాలకు హాజరయ్యారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చర్చల్లో టాప్లో ఉన్నారు. ఆయన 21 చర్చల్లో పాల్గొన్నారు. నల్గొండ ఎంపీ రఘువీర్ అతి తక్కువ హాజరుతో పాటుగా.. తక్కువ ప్రశ్నలు, చర్చల్లో పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com