DK Aruna : వక్ఫ్ బాధితుల కోసమే బిల్లు.. ట్రోలింగ్ సరికాదన్న ఎంపీ డీకే అరుణ

DK Aruna : వక్ఫ్ బాధితుల కోసమే బిల్లు.. ట్రోలింగ్ సరికాదన్న ఎంపీ డీకే అరుణ
X

వక్ఫ్ బిల్లు విషయంలో NDA ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతుందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. వక్ఫ్ బాధితుల సమస్యల కోసం కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేస్తోందన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వక్ఫ్ భూ బాధిత ముఖాముఖి సమావేశానికి ఆమె హాజరయ్యారు.

దేశంలో వక్ఫ్ వివాదాలు ఉన్న చోట కమిటీ పర్యటించి.. బాధితుల సమస్యలను తెలుసుకుంటుందని చెప్పారు. త్వరలో తెలంగాణలో కూడా కమిటీ సభ్యులు పర్యటించి.. రాష్ట్రంలోని 80 వేల ఎకరాల వక్ఫ్ భూమి సమస్యలు తెలుసుకుంటారన్నారు. సోషల్ మీడియాలో బిల్లుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు డీకే అరుణ.

Tags

Next Story