MP Etala Rajender : ముత్యాలమ్మ ప్రతిష్ఠ సందర్భంగా ఎంపీ ఈటల ఆగ్రహం

ప్రజల విశ్వాసాలతో చెలగాటమాడడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్ హితవు చెప్పారు. అహంకారపూరితంగా ప్రజలకు మనోభావాలకు విరుద్ధమైన చర్యలు చేస్తే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలా కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. కొంతమంది హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, వారి మనోభావాలను దెబ్బతీస్తూ సికింద్రాబాద్ కుమ్మరి గూడ ముత్యాలమ్మ ఆలయం మీద దాడి చేశారని ధ్వజమెత్తారు. నిందితులను ఈ ప్రాంత ప్రజలు పట్టుకుని పోలీసులుకు అప్పగిస్తే రోజులు గడిచినా ఇక్కడి ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఈ మేరకు సికింద్రాబాద్ లోని కుమ్మరి గూడలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ.. ముత్యాలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసేందుకు బస్తీవాసులు కొద్ది రోజులుగా దీక్షలు పూజలు నిర్వ హిస్తుంటే వాటిని నిలువరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ చెపట్టారని ఆ ర్యాలీ మీద అకారణంగా పోలీసులు దాడిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మందిపై కేసులు పెట్టి, జైల్లో పెట్టార ని దుయ్య బట్టారు. చివరికి ప్రభుత్వం దిగివచ్చి ఈ ఆలయాన్ని మళ్లీ పునః ప్రతిష్ట చేస్తామని చెప్పక తప్పలేదన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎవరు విశ్వాసాలకు తగ్గట్టుగా వారు బ్యానర్లు పెట్టుకున్నారని, కానీ ప్రభుత్వంలో ఉన్నవారు ఆదేశాలిచ్చి మున్సిపల్ అధికారుల చేత బ్యానర్లు చింపేసినట్టుగా తెలుస్తోందని మండిపడ్డారు. పోలీసులు మోహరించినా కళ్ళముందే బ్యానర్లు చింపారంటే రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com