TG : రేవంత్ పాలన బాగుందంటే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా : ఎంపీ ఈటల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుందని ప్రజలు అంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ చేశారు. సీఎం మంచి పని చేస్తున్నారని ప్రజలు మెచ్చుకుంటే ముక్కు నేలకు కూడా రాస్తానన్నారు. గురువారం సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. హరీశ్ రావు ఏదో రాసిస్తే తాను మాట్లాడుతానని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి భద్రత లేకుండా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళదామా? అని నిలదీశారు. నీకు దమ్ముంటే నేను మీరు ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా?ఒక రోజు రెండు రోజుల డేట్ పెట్టండని ఛాలెంజ్ చేశారు. చట్టం సిస్టం లేని అరాచక శక్తివి నీవని అన్నారు. బై డిఫాల్ట్ సీఎం అయ్యావన్నారు. మేము బరిగేసి కొట్లడిన నాడు నువ్వు ఆంధ్రపాలకుల సంకలో ఉన్నావు. నేను కానీ, మా పార్టీ గాని అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మూసి ప్రక్షాళనకు కూడా వ్యతిరేకం కాదు. చెరువులు బాగుచేయడానికి కూడా మేము వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. పిట్టల దొరలా మాట్లాడుతున్నారు. సిఎంలాగా కాకుండా బ్రోకర్ లా మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారని, తాను కాదన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com