MP Etela Rajender : నోటీసులకు భయపడను..విచారణకు హాజరవుతా: ఎంపీ ఈటల

కాళేశ్వరం కమిషన్ నుంచి తనకు ఇంకా నోటీసులు అందలేదని, వాటికి తాను భయ పడబోనని, విచారణకు హాజరవుతానని మాజీ మంత్రి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఆర్థిక శాఖమంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృ ష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్ గా ఉన్నారని చెప్పారు. పీసీ కమిషన్ ను ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. తనతో మం త్రులుగా పనిచేసిన వాళ్లంతా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారని చెప్పారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా అని ఈటల ప్రశ్నించా రు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటలకు పీసీ ఘోష్ కమిషన్ నిన్న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 5న విచారణకు రావాలని కేసీ ఆర్కు, జూన్ 6 హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందరన్ను విచారణకు రావాలని పీసీ కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com