MP Raghunandan Rao : ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు : ఎంపీ రఘునందన్ రావు

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు స్పష్టం చేశారు. ఒక ఆడబిడ్డను అవమానించేలా పోస్టులు పెట్టడం తగదని హెచ్చరించారు. దుబ్బాక, సిద్దిపేట, సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సంగారెడ్డి గంజి మైదాన్‌లో గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. స్వచ్ఛభారత్‌లో బాగంగా రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. హైడ్రా గురించి ఎవరిష్టం వచ్చినట్టు వారు అవగాహన లేకుండా మాట్లాడాతున్నారని, దీనిపై సీఎం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. హైడ్రాపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసినవన్నీ మర్చిపోయి, మా మీద నుంచి బుల్డోజర్లు వెళ్లాలని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తప్పు ఎక్కడ జరిగినా.. బుల్డోజర్లు వస్తాయని, బుల్డోజరు తప్పు చేసిన వారి మీద నుంచి తప్పకుండా వెళ్తుందని వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com