TG : వరంగల్ బీఆర్ఎస్ సభకు ముక్రాకే భారీ విరాళం

అన్ని రంగాల్లో అండగా నిల్చిన ముక్రాకే గ్రామం మరోసారి తన ఉదారతను చాటుతుంది. బీఆర్ఎస్ హయాంలో దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన ఆ గ్రామమే నేడు బీఆర్ఎస్ వేడుకల నిర్వహణకు స్వచ్ఛందంగా విరాళాన్ని అందజేసి మరోసారి ఆదర్శంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్థులు ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రూ. 1,02, 003 విరాళాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేయాలని నిర్ణయించారు. సోమవారం మాజీ సర్పంచ్ మీనాక్షి ఆధ్వర్యంలో గ్రామస్థులు ఇంటింటికి విరాళాలు సేకరించారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో గ్రామంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని గ్రామస్తులు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ఫలితంగా తమకు ఉపాధి ఎంతో మెరుగుపడిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉన్న తాము వరంగల్ సభకు అందరం వెళ్తామని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com