Telangana News : మున్సిపల్ పోరు.. మూడు పార్టీల ఎమ్మెల్యేలకు టెన్షన్..

Telangana News : మున్సిపల్ పోరు.. మూడు పార్టీల ఎమ్మెల్యేలకు టెన్షన్..
X

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎన్నికలు జరపడానికి ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే మూడు పార్టీల ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. పంచాయితీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవు కాబట్టి ఎమ్మెల్యేలకు పెద్దగా టాస్కులు అప్పగించలేవు పార్టీలు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పార్టీలు గుర్తుతోనే జరుగుతాయి కాబట్టి అన్ని పార్టీలు ఎమ్మెల్యేలకు టాస్కులు అప్పగించాయి. పంచాయతీ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ మాత్రమే ఎమ్మెల్యేలను గ్రామాల్లో ఉంచి ఎక్కువ సీట్లు సాధించుకుంది. దీంతో ఇప్పుడు మిగిలిన బీఆర్ఎస్, బిజెపి పార్టీలు కూడా తమ ఎమ్మెల్యేలను రంగంలోకి దించుతున్నాయి.

తమ నియోజకవర్గాల్లోని మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సీట్లు సాధించాలని ఎమ్మెల్యేలను పార్టీలు ఇప్పటికే ఆదేశించాయి. ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి అనేది సర్వేలు చేయించి నివేదికలు అప్పగించాలని సూచించాయి మూడు పార్టీలు. ఎమ్మెల్యేలు సూచించిన వారికే టికెట్లు ఇస్తామని.. కచ్చితంగా గెలిపించుకొని రావాలి అంటూ అన్ని పార్టీలు ఆదేశిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు తమ పరిధిలోని మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ ఎన్నికలకు తీవ్రంగా కష్టపడుతున్నారు. తమ పరిధిలో అత్యధిక సీట్లు గెలవకపోతే తమకే ఇమేజ్ డ్యామేజ్ అనే కొత్త టెన్షన్ లో వాళ్ళు ఉన్నారు.

ఇప్పుడు సాధించే మున్సిపల్ సీట్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా బలాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలని విషయం మీద చర్చలు జరుపుతూ.. రెబల్స్ ను బుజ్జగిస్తూ బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీలకు చెందిన వారిని కూడా లాగేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇతర ఎమ్మెల్యేల కంటే తాము సీటు తక్కువగా గెలిస్తే పార్టీ అధిష్టానం వద్ద పరువు పోతుందనే ఆలోచనలో వాళ్లు తెగ టెన్షన్ పడిపోతున్నారు అంట.

Tags

Next Story