MUNCIPAL RESULT:మధిరలో టీడీపీ ఘనవిజయం

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) బోణీ కొట్టింది. మధిరలో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి ఘన విజయం సాధించారు. ఇటు, రాష్ట్రంలో 17 మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.155 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ 85, బీజేపీ 17, ఇతరులు 12 చోట్ల విజయం సాధించారు.
గడ్డపోతారంలో కారు జోరు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులకు గాను... ఏకంగా 14 వార్డులను కైవసం చేసుకుని అధికార పీఠాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 2 వార్డులకే పరిమితం అయ్యింది. మిగిలిన చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో BRS బోణి కొట్టింది. 11, 12 వార్డుల్లో BRS అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు.. లక్సెట్టిపేట కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బ్యాలెట్ బాక్సుల భద్రతపై అనుమానంతో BJP, BRS అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మూడో వార్డు బాక్సు సీలింగ్‌పై వివాదం తలెత్తడంతో.. సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాతే కౌంటింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం 12 వార్డులకు గానూ 11 వార్డుల్లో విజయం సాధించి మున్సిపాలిటీని హస్తం పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన హవాను చాటుతోంది. నందికొండలో క్లీన్ స్వీప్ దిశగా సాగిన ఈ ఫలితం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
‘పుర’ ఫలితాల వేళ.. లేఖ కలకలం
సూర్యాపేట బ్యాలెట్ బాక్స్‌లో వచ్చిన లేఖ వైరల్ అవుతోంది. " ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా! . మేము రిటైర్మెంట్ అయ్యి 15 నెలలు గడిచింది. మీరు చెల్లించాల్సిన డబ్బులు ఏ ఒక్క పైసా కూడా రాలేదు. అనేక ఇబ్బందులు పడుతూ.. అనారోగ్యం పాలవుతూ.. వైద్యం చేయించుకోలేక ఇప్పటి వరకు 62 మంది చనిపోయారు. అందుకే బాధతో మేము చనిపోక ముందే మా డబ్బులు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం." అని లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
