Murali Mohan : గద్దర్ ఫిల్మ్ స్పెషల్ అవార్డ్స్ కమిటీ చైర్మన్ గా మురళీ మోహన్

Murali Mohan : గద్దర్ ఫిల్మ్ స్పెషల్ అవార్డ్స్ కమిటీ చైర్మన్ గా మురళీ మోహన్
X

గద్దర్ ఫిల్మ్ స్పెషల్ అవార్డ్స్ కమిటీ చైర్మన్ సీనియర్ నటుడు మురళీ మోహన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి టి. వినయ్ కృష్ణారెడ్డి ఉత్త ర్వ్యులు జారీ చేశారు. దర్శకుడు కె.దశరథ్, కూచిపూడి వెంకట్, నిర్మాతలు డి.వి.కె.రాజు, కె.శ్రీధర్ రెడ్డి, ప్రముఖ కూచిపూడి నాట్య గురు డా.వనజా ఉదయ్, నటి ఊహ, సీనియర్ జర్న లిస్ట్ కె.ఉమామహేశ్వరరావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గత పదేళ్లుగా నంది అవార్డ్స్ ఇవ్వనందున ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ను ఈ అవార్డ్స్ కమిటీ ఎంపిక చేస్తుంది. అలాగే ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, పైడి జయరాజ్, ప్రభాకర్ రెడ్డి తదితరుల పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కా రాలకు కూడా ఎంపిక చేస్తారు. ఇప్పటికే నటి జయసుధ అధ్యక్షతన ఏర్పడిన జ్యూరీ సభ్యులు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంపిక కోసం వరసగా సినిమాలు తిలకిస్తున్నారు. ఉత్తమ సినిమా పుస్తకం... ఇక ఉత్తమ సినిమా పుస్తకం ఎంపిక కోసం సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, వడ్లమాని కనకదు ర్థ, వి. మధుసూదన్ లను నియమించారు. గత ఏడాది ప్రచురించిన పుస్తకాల్లోంచి అత్యుత్తమ సినిమా పుస్తకాన్ని వీరు ఎంపిక చేస్తారు. జూన్ 14న హైటెక్స్ లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదా నోత్సవం నిర్వహించనున్నారు.

Tags

Next Story