మూసీ నది చుట్టూ ముదురుతున్న రాజకీయాలు..

తెలంగాణలో రోజుకొక అంశం మీద రాజకీయాలు మొదలుతున్నాయి. మొన్నటిదాకా నీటి ప్రాజెక్టుల చుట్టూ పెద్ద ఎత్తున రాజకీయాలు రాజకున్నాయి. ఇప్పుడు మూసి సుందరీకరణ చుట్టూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ అండ్ బిజెపి అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. మూసి సుందరీకరణలో ఐదు వేల కోట్లతో గాంధీ విగ్రహం కడుతున్నారని.. ఇండ్లన్నీ కూల్ చేస్తున్నారంటూ గులాబీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అటు బిజెపి నాయకులు కూడా ఇదే విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం తాము ఎలాంటి విగ్రహం కట్టడం లేదని చెబుతున్నారు. 5000 కోట్ల బడ్జెట్ తాము అసలే కేటాయించట్లేదని వివరించారు. కానీ దీని మీద విమర్శలు, ప్రతి విమర్శలు ఆగట్లేదు. ఎందుకంటే ఇదే విషయాన్ని అగ్రనేతలు మాత్రం అంగీకరించట్లేదు.
నిన్న మాజీ మంత్రి కేటీఆర్ నాగోల్ లోని ఎస్ టి పి ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసి సుందరీ కారణకు తాము వ్యతిరేకం కాదని కాకపోతే ఎలాంటి ఇండ్లు కూర్చకుండా చేపట్టాలంటూ చెప్పారు. నిన్ను కూల్చితే తాము మాత్రం ఊరుకోమని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామంటూ హెచ్చరించారు. అటు బిజెపి నాయకులు కూడా మూసి సుందరీ కారణ చుట్టూ పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అపార్ట్మెంట్ వాసులు బయటకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. తమ ఇండ్లు కూల్ చేస్తున్నారని వేరే చోట ఇచ్చిన సరే వద్దంటున్నారు.
దీంతో ఈ విషయంలో పెద్ద ఎత్తున రాజకీయాలు రాసుకుంటున్నాయి. మూసిని అత్యద్భుతంగా డెవలప్ చేస్తామని పూర్తిగా శుద్ధి చేస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది. టిఆర్ఎస్ పదేళ్ల కాలంలో మూసిని సర్వనాశనం చేసిందని.. డబ్బులు దోచుకున్నారు తప్ప అభివృద్ధి చేయలేదంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలా ఇరు పార్టీల వాదనలతో మూసి రాజకీయం పెద్ద ఎత్తున రాజకుంటోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
