Musi River : మూసీ చుట్టూ రాజకీయాలు.. మూడు పార్టీల వాదనలు.

Musi River : మూసీ చుట్టూ రాజకీయాలు.. మూడు పార్టీల వాదనలు.
X

మూసీ నది చుట్టూ ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే బీఆర్ ఎస్ మాత్రం పేదల ఇండ్లను కూల్చేస్తున్నారంటూ మండిపడుతోంది. అటు బీజేపీ ఏమో.. మూసీ పేరుతో స్కామ్ చేస్తున్నారని మండిపడుతోంది. మూసీ నిర్వాసితులు తమ ఇండ్లను కూల్చొద్దంటూ చాలా మంది వాపోతుఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. తమకు వేరే చోట ఇండ్లు కట్టించినా వద్దని వాపోతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మూసీని ఇలాగే వదిలేస్తే అన్ని హైదరాబాద్ పట్టణానికే ప్రమాదం అని చెబుతోంది. మూసీతో ఇప్పటికే వందల ఇండ్లునీట మునుగుతున్నాయని.. కాబట్టి దాన్ని పునరుద్ధరించాల్సిందేనని చెబుతోంది. ఇలా

అటు బీఆర్ ఎస్ మాత్రం తమ హయాంలో మూసీ చుట్టూ అభివృద్ధి పనులు చాలా చేశామని చెబుతోంది. పేదల ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేయొచ్చని.. కానీ ఇండ్లు కూల్చడం ఎందుకు అంటూ సీరియస్ అవుతోంది. ఈ విషయంలో మూడు పార్టీలు రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. అటు బీఆర్ ఎస్ ఇప్పటికే ఈ విషయం మీద చాలా రకాలుగా పోరాటాలు జరుపుతోంది.

ఇంకోవైపు బీజేపీ కూడా బాధితుల తరఫున పోరాడుతమని చెబుతోంది. కాంగ్రెస్ మాత్రం ఉత్తర భారతంలో నదులను పునరుద్దధరించినట్టు ఇక్కడ పునరుద్ధరిస్తామంటూ ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వాపోతోంది. మూసీని ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించి తీరుతామంటూ చెబుతోంది.

Tags

Next Story