Musi : మూసారాంబాగ్ వద్ద మూసీ ప్రవాహం

Musi  : మూసారాంబాగ్ వద్ద మూసీ ప్రవాహం
X

మూసారాంబాగ్ వద్ద మూసీ ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. లోతట్టు బస్తీలు నీటమునిగాయి. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇక రోజంతా పడ్డ వానలతో హైదరాబాద్ రహదారుల్లో వరద...ఏరులై పారతోంది. రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు...మూసీ, E.C నదులు ఉగ్రరూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేశారు. హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు...నీట మునిగాయి. లోతట్టు కాలనీ ఇళ్లలోకి వరద చేరింది. ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. గంట గంటకు వరద ఉదృతి పెరుగుతుండటంతో C.M రేవంత్ రెడ్డి సైతం...G.H.M.C, హైడ్రా, D.R.F సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని అదేశించారు.

Tags

Next Story