Akbaruddin : బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే బీసీ జాబితాలో ముస్లింలు: అక్బరుద్దీన్

Akbaruddin : బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే బీసీ జాబితాలో ముస్లింలు: అక్బరుద్దీన్
X

బీసీ జాబితాలో ముస్లింలను కొనసాగిస్తున్న నితీష్, చంద్రబాబునాయుడు మద్దతుతో కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ... తెలంగాణలో మాత్రం బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేయడం ఏ మేరకు సమంజసమని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. గుజరాత్, మధ్యప్రదేశ్ తోపాటు ఎన్డీఏ అధికారంలో ఉన్న బీహార్, ఏపీలోనూ బీసీల జాబితాలో ముస్లింలు ఉన్నారని గుర్తు చేశారు. ముస్లిం విద్యార్థుల పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్పులు చెల్లించాలని, ఛార్మినార్ పెడజేసన్, ముర్గీచౌక్ తదితర ప్రాజెక్టుల కోసం రూ.100కోట్లు విడుదల చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ వివాదాస్పాద భూముల జాబితాలో వర్ఫ్ ఆస్థులను చేర్చిందని, భూభారతి పోర్టల్లోనైనా వర్ఫ్ భూములను వివాదాస్పద జాబితానుంచి తొలగించాలని కోరారు. ముస్లింలను బీసీ జాబితాలో కొన సాగిస్తే బీసీల రిజర్వేషన్లు తగ్గుతాయనడం వట్టి అపోహేనన్నారు.

Tags

Next Story