KTR : మన్మోహన్‌కు మా నాన్న సన్నిహితుడు.. కేటీఆర్ భావోద్వేగం

రాజకీయాల్లో అధికారం మారుతుండొచ్చు కానీ, దేశం మంచిని కాంక్షించేవాళ్లలో మన్మోహన్ సింగ్ ఒకరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రపంచ దేశాల సరసన HOT భారత్ ఈ రోజు గర్వంగా నిలబడింది అంటే అది మన్మోహన్ సింగ్ గారి చలవే అన్నారు. దేశ ఆర్థిక స్థితి గతులను మార్చిన గొప్ప సంస్కర్త అని కొని యాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుకు వెన్ను తట్టి ప్రోత్సహించారని గుర్తు చేసుకు న్నారు. శుక్రవారం ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి సాను భూతిని తెలిపారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మన్మోహన్ సింగ్ కు ప్రత్యేక అనుబంధం ఉండేదని గుర్తు చేశారు. దాదాపు రెండేళ్ల పాటు కేంద్ర క్యాబినెట్లో కలిసి పని చేశార న్నారు. ఎన్నో సందర్భాల్లో కేసీఆర్, మన్మోహన్ సింగ్ కలిసినప్పుడు ఎట్లా ఉంది తెలంగాణ అని ఆరా తీసేవారన్నారు. 2004లో క్యాబినెట్లో చేరిన తర్వాత తెలం గాణ ఏర్పాటులో ఆటంకాలు ఎదురైన ప్పుడు వెనకడుగు వేయొద్దని సూచించారన్నారు. మా డిమాండ్లో న్యాయం ఉందని అనేవారన్నారు. ఓ సౌమ్యుడిగా, వివాద రహితుడిగా, దేశానికి మంచి పేరును తెచ్చిన వ్యక్తిగా మన్మోహన్ నిలిచారన్నారు. మహానుబావుడిని కోల్పోవడం దేశానికి పెద్ద లోటన్నారు. కేటీఆర్ తో పాటు ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు పాల్గొని నివాళులు అర్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com