TG : అనుమానాస్పదంగా యువకుడి మృతి

TG : అనుమానాస్పదంగా యువకుడి మృతి
X

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన నిజాంపేట మండలం కల్వకుంటలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కల్వకుంట కు చెందిన ముష్టి గొల్ల కృష్ణ(35) ఈనెల 20 ఆదివారం సాయంత్రం 7 గంటలకు బయటికి వెళ్తున్నానని చెప్పి ఎంతకీ తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. కల్వకుంట శివారులోని సబ్ స్టేషన్ సమీపంలో మృతదేహం లభ్యమవడంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Tags

Next Story