TG : నాగారం భూకేసు.. ఈడీ విచారణకు మహేశ్వరం మాజీ ఆర్డీవో

TG : నాగారం భూకేసు.. ఈడీ విచారణకు మహేశ్వరం మాజీ ఆర్డీవో
X

మహేశ్వరంలోని నాగారం భూకేటా యింపుల వ్యవహారంలో మహేశ్వరం మాజీ ఆర్డీవో వెంకటచారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్, ఎమ్మా ర్వో జ్యోతి విచారణ ఆధారంగా మాజీ ఆర్డీవోకు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా మహేశ్వరంలోని నాగారంలో సర్వేనెంబర్ 181లోని 42 ఎకరాల భూ కేటాయింపులపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అందుకు సంబంధించి మెహి దీపట్నానికి చెందిన షరీఫ్ కంప్లెంట్ ఆధారంగా మహేశ్వరం పీఎస్ లో గతేడాది మార్చిలో కేసు నమోదైంది. పోలీసు కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. భూదాన్ బోర్డుకు చెందిన 50 ఎకరాల భూమిని ఖాదురున్నీసా అనే మహిళకు అధికారులు రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలిసిందే. క్రమంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా అమోయ్ కుమార్ ఉండడంతో ఈడీ ఆయనను వి చారించింది. కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పటి ఆర్డీవో, ఎమ్మార్వో అప్పటికప్పుడు రిజిస్ట్రేష న్లు చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో అధికారుల కు భారీగా లబ్ధి చేకూరినట్లుగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక లావాదేవీల పైన ఆర్డీవో వెంకటాచారిని ఈడీ ప్రశ్నిస్తోంది.

Tags

Next Story