Nagarjuna : సురేఖపై నాగార్జున పరువునష్టం దావా

చైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో అసంబద్ధ ఆరోపణలు చేసిన తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున లీగల్ ఫైట్ చేస్తున్నారు. నాగార్జున గురువారం నాంపల్లి కోర్టులో పరువునష్టం, క్రిమి నల్ కేసులు దాఖలు చేశారు. మంత్రి సురేఖ తన కుటుంబ పరు వుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని నాగార్జున దాఖ లు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని అయన తన పిటీషన్ లో కోర్టును కోరారు. ఈ కేసును శనివారం విచారణ చేపట్టనున్నట్టు
న్యాయమూర్తి తెలిపారు. టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, నాగచైతన్య, సమంత వ్యక్తిగత విష యాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ బుధవారం చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొండ సురేఖపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. తమ రాజకీయ మనుగడ కోసం సినీ తారలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదనిమీడియా వేదికగా సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు కొండా సురేఖ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com