Nagarjuna : నేడు నాంపల్లి కోర్టుకు నాగార్జున

Nagarjuna : నేడు నాంపల్లి కోర్టుకు నాగార్జున
X

సినీ నటుడు నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున వేసిన క్రిమినల్‌ పరువునష్టం దావాపై సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంలో మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. ‘మా కుటుంబంపై మంత్రి సురేఖ రాజకీయ దురుద్దేశంతో నిరాధార వ్యాఖ్యలు చేశారు. వాటివల్ల మా కుటుంబంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. నిజానిజాలు తెలుసుకోకుండా పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలి’ అని నాగార్జున గత గురువారం నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. కాగా, సమంత నాగచైతన్య విడాకుల విషయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.ఈ వ్యవహారంలో టాలీవుడ్ అంతా నాగార్జున కుటుంబానికి మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణ సర్వత్రా ఉత్కంఠగా మారింది.

Tags

Next Story