Nalgonda Intelligence SP : నల్గొండ ఇంటెలిజెన్స్ ఎస్పీపై వేటు

Nalgonda Intelligence SP : నల్గొండ ఇంటెలిజెన్స్ ఎస్పీపై వేటు
X

నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది.ఆమెను డీజీపీ ఆఫీస్కు ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్ర మాలు, వసూళ్ల పై ఆమెపై సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పోలీస్ శాఖ ఎంక్వైరీ చేపట్టగా రిపోర్ట్ ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకు న్నట్లు తెలుస్తోంది. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉండగా.. సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్ కోసం లంచం వసూలు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుం డా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లు లేఖలో తెలిపారు. దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా 7 ఏండ్లు పని చేశారు. ఈ టైంలో రేషన్, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేశారన్న అభియోగాలు వచ్చాయి. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం.

Tags

Next Story