Narendra Modi: హైదరాబాద్‌ పర్యటనలో కేసీఆర్ పాలనపై ప్రధాని తీవ్ర విమర్శలు..

Narendra Modi: హైదరాబాద్‌ పర్యటనలో కేసీఆర్ పాలనపై ప్రధాని తీవ్ర విమర్శలు..
Narendra Modi: తెలంగాణలో పాగా వేయడం లక్ష్యంగా ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు.

Narendra Modi: తెలంగాణలో పాగా వేయడం లక్ష్యంగా ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తే.. దేశవ్యాప్తంగా ప్రాంతీయ శక్తుల్ని ఏకం చేయడం ద్వారా ఢిల్లీలో BJPని గద్దె దించాలని ప్లాన్‌ చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. నిన్న ISB స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన మోదీ.. KCRది కుటుంబ పాలన అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణలో BJPకి అధికారం ఖాయమన్నారు.

కేంద్ర పథకాలకు పేర్లు మార్చి అమలు చేయడం తప్ప TRS సర్కార్ కొత్తగా చేసిందేమీ లేదన్నారు. ప్రధాని మోదీ నోటి నుంచి ఈ మాటలు వస్తూనే తెలంగాణ మంత్రులంతా మూకుమ్మడిగా ఎదురుదాడి చేశారు. దేశం నుంచి BJPని తరిమి కొట్టాలని ఎర్రబెల్లి అంటే.. పదిజన్మలెత్తినా ఇక్కడ కమలనాథులకు అధికారం అందడం కల్లే అన్నారు ఇంద్రకరణ్‌రెడ్డి.

ప్రధానిగా రాష్ట్రానికి వచ్చిన మోదీ.. పార్టీ అధ్యక్షుడి తరహాలో వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన స్థాయికి తగదని ప్రశాంత్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణపై విషం చిమ్మడం ఇప్పటికైనా ఆపాలని సబిత అంటే.. కుటుంబ రాజకీయాల గురించి BJP మాట్లాడడం హాస్యాస్పదమంటూ మంత్రి హరీష్‌ కౌంటర్ ఇచ్చారు. మత కలహాలు సృష్టించే పార్టీలు తమకు నీతులు చెప్పక్కర్లేదన్నారు.

ఇక.. ప్రధాని వచ్చిన టైమ్‌లో బెంగళూరు పర్యటనలో ఉన్న KCR.. కేంద్రంలో మార్పు తథ్యమంటూ జోస్యం చెప్పారు. 2-3 నెలల్లో సంచలనం చూస్తారంటూ చెప్పుకొచ్చారు. ఇవాళ రేపట్లో మోదీ వ్యాఖ్యలకు KCR గట్టిగానే కౌంటర్‌ ఇస్తారని TRS వర్గాలు చెప్తున్నాయి. ముందుగా మోదీ మాట్లాడిన మాటల్ని చూస్తే.. తగ్గేదే లే అన్నట్టుగా ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు.

తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలు ఓ కుటుంబం కోసం కాదు అంటూ తొలి మాటల్లోనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి తీవ్రంగా పెరిగిపోయిందన్నారు. మాటలే తప్ప చేతల్లేని ప్రధాని అంటూ మోదీపై విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రులు. దేశ చరిత్రలో ఇంతటి విఫల ప్రధానిని చూడలేదంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. అధికారం కోసం కుటుంబ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న BJP నీతులు చెప్తే నమ్మే పరిస్థితి లేదన్నారు హరీష్‌రావు.

మత విద్వేషాల్ని రెచ్చగొట్టడం తప్ప చేసిందేంటి అంటూ నిలదీశారు. హైదరాబాద్‌ వేదికగా తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రధాని మాట్లాడిన మాటలపై KCR ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. బెంగళూరు పర్యటనలో జాతీయ రాజకీయాల్లో ప్రత్యమ్నాయ కూటమిపై చర్చలు జరిపిన ఆయన.. BJPని గద్దె దించడమే తన లక్ష్యమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story