National Biodiversity Conference : రేపటి నుంచి జీవవైవిధ్య జాతీయ సదస్సు

జీవ వైవిధ్య మండలి జాతీయ సదస్సుకు హైదరా బాద్ వేదికైంది. రేపట్నుంచి మూడు రోజులపాటు సదస్సు జరగనుందని, యువతకు జీవవైవిధ్యంపై అవగాహన కల్పించేందుకే యువజన జాతీయ బయోడైవర్సిటీ సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర జీవవైవిధ్య మండలి సభ్య కార్యదర్శి, ఐఏఎస్ అధికారి కాళీచరణ్ ఎస్ కర్తాడే వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కన్హశాంతి వనంలో జరిగే ఈ సదస్సుకు దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి యువతను ఆహ్వానించినట్లు చెప్పారు. మంగళవారం అరణ్యభవన్లో రీజినల్ కోఆర్డినేటర్ శిల్పిశర్మ, మరో అధికారి అన్సార్ అహ్మద్ కలిసి ఆయన మీడియా తో మాట్లాడారు. ఇప్పటి వరకు 650 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. ఈ సదస్సుకు నేషనల్ బయోడైవర్సిటీ చైర్ పర్సన్ సీ అచలేందర్ రెడ్డి, పంజాబ్ బయో డైవర్సిటీ పూర్వ కార్యదర్శి డాక్టర్ నీలిమా జెరాత్, పద్మశ్రీ అవార్డు గ్రహిత రహిబాయి సోమా పోపరే, రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్తో పాటు ఫరీదా థంపాల్, డాక్టర్ వీబీ మాథుర్, డాక్టర్ యోగితా కరాచె, మీనల్ తట్పాటీ, హేమావతి శేఖర్ పలు అంశాలపై మాట్లాడుతారని, సదస్సులో హైదరాబాద్ డిక్లరేషన్ ను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com