KCR Third Front: కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు.. చర్చనీయాంశంగా జాతీయ మీడియా కథనాలు..

KCR Third Front: తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్రంట్ ప్రయత్నాలపై ప్రయత్నాలపై జాతీయ మీడియాలో కథనాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల నాటికి విపక్ష కూటమి ఏర్పాటుపై జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది.. విపక్షాల తరపున బిహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది..
విపక్ష కూటమి ఐక్యత, నితీష్ కుమార్‌ను కేసీఆరే ప్రతిపాదిస్తున్నారని పలు జాతీయ ఆంగ్ల, హిందీ పత్రికలతోపాటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి.. కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ సమావేశం తర్వాత నితీష్ కుమార్‌తో పీకే మీటింగ్ గురించి విశ్లేషణలు వస్తున్నాయి.. యూపీ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ ఎన్డీయే నుంచి బయటకు వస్తారనే ప్రచారం జరుగుతోంది.. అయితే, తనకు మాత్రం అలాంటి ఆలోచన లేదని నితీష్ చెప్తున్నారు.
బీజేపీని వీడితే నితీష్ రాష్ట్రపతి అభ్యర్థి కావడానికి అవకాశాలు ఉన్నాయని ఎన్సీపీ చెప్తోంది.. అటు ఇప్పటికే విపక్ష కూటమికి సంబంధించి టీవీ5 ముందుగానే సంచలన కథనం ప్రసారం చేసింది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నాటికి విపక్షాలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. నితీష్ కుమార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారని సంచలన కథనాన్ని టీవీ5 ఇటీవలే ప్రసారం చేసింది.. దీంతో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com