National Youth Award : నాగర్ కర్నూల్ యువకుడికి జాతీయ యువజన అవార్డు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ యువజన అవార్డును నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన శివకుమార్ సొంతం చేసుకున్నాడు. శివకుమార్ తల్లిదండ్రులు ఆయన చిన్నతనంలోనే చని పోయారు. దీంతో ఆలనా పాలనా అక్కబావే చూసుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న స్వామి వివేకానంద మాటలే స్ఫూర్తిగా పెరిగాడు. 5వ తరగతిలోనే స్నేహితులతో కలిసి స్వామి వివేకానంద సేవా సంస్థ స్థాపించాడు. 13 ఏళ్లుగా పర్యావరణం, ప్లాస్టిక్ నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అంతేనా తనే స్వయంగా అవయవదానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఫలితంగా కేంద్రం ఇచ్చే ప్రతిష్టాత్మక నేషనల్ యూత్ అవార్డు ఆయన ఎంపికయ్యాడు.
చేసేది చిన్న సహాయమే అయినా దాని ప్రభావం చాలా ఉంటుం దని శివకుమార్ భావించాడు. తనవంతు ఏమి చేయగలడో అని ఆలోచించి సేవ చేయడానికి ఉన్న ప్రతి అంశాన్ని వినియోగించు కున్నాడు. పెళ్లిళ్లు, విందులు జరిగి నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆహారం మిగిలి పోతుంది. దాన్ని పడేస్తుంటారు. కానీ అలా వృధా చేయకుండా దాన్ని గుడిసెల్లో, చిన్న చిన్న ప్రాంతాల్లో ఉండే వారికి పంచితే ఆకలి తీరుతుందని ఆలోచించాడు. దీని వల్ల ఆహారం వృధా కాదనుకున్నాడు. అలా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైనా ఫంక్షన్లు ఇలాంటివి జరిగితే వారి దగ్గరికి వెళ్లి మాట్లాడి, మిగిలిపోయిన ఆహారాన్ని పంచిపెట్టేవాడు. నేషనల్ యూత్ అవార్డు రావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉందని శివకుమార్ చెప్పారు. తనకు చిన్న ప్పటి నుంచి పేదలకు సహాయం చేయడం చాలా ఇష్టమని తోచినంత వరకు పేదల కు సహాయం చేస్తూనే ఉంటానని ప్రస్తుతం యువత స్వయం ఉపాధి గురించి ఆలోచిస్తున్నానని అవార్డు జాతీయ యువజన అవార్డు గ్రహీత శివకుమార్ వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com