TG RTC : నిరుపయోగంగా బస్టాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామ ప్రయాణికుల ప్రాంగణం ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. కుక్కలు, ఇతర జంతువులకు అది ఆవాసంగా మారింది. చిమిర్యాల నుంచి విద్యార్థులు రోజూ పాఠశాలకు, ఉన్నత విద్య కోసం యువతి, యువకులు కళాశాలలకు, రోజువారి పనులరీత్యా కొందరు, వివిధ ఉద్యోగాల రీత్యా చౌటుప్పల్, హైదరాబాద్, నల్గొండ ప్రాంతాలకు వందల సంఖ్యలో ప్రయాణం సాగిస్తుంటారు. వీరంతా ఈ బస్టాండ్ దగ్గరే బస్సు ఎక్కాల్సి ఉంటుంది. కానీ ఎన్నో ఏళ్లుగా దీన్ని శుభ్రపరచడం లేదు. దీంతో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారింది. ఎండకు, వానకు రోడ్డుపైనే చెట్ల కింద బస్సు కోసం వేచి చూడాల్సి వస్తున్నది తప్ప.. బస్టాండ్ ప్రజలకు ఉపయోగపడటం లేదు. ప్రభుత్వ అధికారులు, యువత చొరవ తీసుకొని దాన్ని బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com