Telangana : ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్ల కోసం కొత్త విధానం

Telangana : ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్ల కోసం కొత్త విధానం
X

ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్ల విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న 15శాతం ఓపెన్ కోటాను తీసేసింది. ఆ కోటా సీట్లను తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్లు, ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించనుంది. దీనికి సంబంధించిన జీవో నంబర్ 15ను విద్యాశాఖ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఫార్మా-డీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో 85శాతం స్థానిక తెలంగాణ స్టూడెంట్లకు, 15శాతం ఓపెన్ కేటగిరి సీట్లలో తెలంగాణతో పాటు ఏపీ స్టూడెంట్స్ పోటీపడే అవకాశం ఉంది. అయితే, ఏపీ, తెలంగాణ విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో పాత విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఫులుస్టాప్‌ పెట్టింది.

స్థానికత, అడ్మిషన్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ పలు కోర్సుల్లో అడ్మిషన్లలో స్థానికత అంశంపై పలు రకాల సిఫార్సులను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కమిటీ సూచనలను పరిశీలించిన సర్కార్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 85శాతం సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే అలాట్ చేయనుంది. స్థానికత, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ఆ సీట్లను కేటాయిస్తుంది.

15శాతం సీట్లను తెలంగాణ స్థానికత ఉండి, ఇతర రాష్ట్రాల్లో చదువుకునేవారితో భర్తీ చేయనుంది. అయితే, తెలంగాణలో పదేళ్ల పాటు నివాసముండాలనే షరతును ప్రభుత్వం పెట్టింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. దీనికితోడు చదువుకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఉపయోగపడనుంది.

Tags

Next Story