TGPSC : టీజీపీఎస్సీకి కొత్త చైర్మన్.. గవర్నర్ ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియామకం అయ్యారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన నియామకానికి సంబంధించిన ఫైల్ పై శనివారం సంతకం చేశారు. దీంతో ఆయన అపాయింట్ మెంట్ కు ఆమోద ముద్ర పడింది. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న ఎం.మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త చైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా సుమారు 45 అప్లికేషన్లు వచ్చాయి. రిటైర్డ్ ఐఏఎస్లు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం టీజీపీఎస్సీ చైర్మన్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, బుర్రా వెంకటేశ్ పేరును సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. ఆ నియామకానికి చెందిన ఫైల్ ను రాజభవన్ కు పంపించగా నేడు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com