ENC Muralidhar : ఈఎన్సీ మురళీధర్ రాజీనామా

రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ENC) జనరల్ పదవికి మురళీధర్ (Muralidhar) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సెక్రటేరియెట్‌లో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు అందించగా ఆయన ఆమోదించారు. దీంతో త్వరలోనే ఆయన స్థానంలో కొత్త ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్)ను ప్రభుత్వం నియమించనుంది.
ఈ లిస్టులో ప్రస్తుతం ఈఎన్సీ అడ్మిన్‌గా కొనసాగుతున్న అనిల్‌కుమార్‌ను (Anil Kumar) నియమించే అవకాశం ఉంది. అనిల్‌కు సైతం మరో ఏడాదిన్నర సర్వీస్ ఉండడంతోపాటు పెద్దగా వివాదాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయననే ఈఎన్సీగా నియమించేందుకు సరారు సమాలోచనలు చేస్తున్నది.
ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్ ఈఎన్సీగా మురళీధర్ రిటైర్డ్ అయ్యారు. కానీ నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy) ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్‌ఎస్ (BRS) సర్కారు మురళీధర్‌రావును కొనసాగించింది. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు కూడా ఆయన ఈఎన్సీ పదవిలో కొనసాగుతారంటూ ఆదేశాలు ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com