Telangana : హైకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం..

Telangana : హైకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం..
X

తెలంగాణ హైకోర్టులో కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ వారితో ప్రమాణం చేయించారు. కాగా దేశంలోని పలు హైకోర్టులకు జడ్జిలు, అడిషనల్ జడ్జిలు, న్యాయవాదులు, జ్యుడీషియల్ ఆఫీసర్లను నియమించేందుకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేయగా...దానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం 19 మందిలో తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వారిలో గౌస్ మీరా మొహియుద్దీన్, ఎస్.చలపతిరావు, వాకిటి రామకృష్ణా రెడ్డి, గడి ప్రవీణ్ కుమార్ ఉన్నారు. వారితో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Tags

Next Story