TG : మూసీ నుంచి కొత్త ఉద్యమం.. కేటీఆర్ స్కెచ్
X
By - Manikanta |16 Oct 2024 1:00 PM IST
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. హైడ్రా కూల్చివేత్తలు, మూసీ నిర్వాసితుల విషయంపై చర్చిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలతో పాటు మూసీ నిర్వాసితుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి ఈ సమావేశంలో కార్యాచరణ సిద్దం చేయనున్నారు. దామగుండంలో నిర్మిస్తున్న రాడార్ స్టేషన్ ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. రాడార్ స్టేషన్ తో మూసీ నదీకి గండం ఉందంటున్న కేటీఆర్.. దీనిపై పెద్ద ఎత్తున నిరసన తెలపాలని నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి మాజీ మంత్రులు మల్లారెడ్డి, పద్మారావు డుమ్మా కొట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com