TG : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు.. ఇవి తీసుకెళ్లండి!

TG : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు.. ఇవి తీసుకెళ్లండి!
X

కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసే వారు మీసేవ సెంటర్లకు తమ కుటుంబసభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇదివరకే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని ఇతరుల పేర్లను జత చేయాలనుకుంటే ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణిల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు రూ.50. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం రూ.50కి మించి వసూలు చేయొద్దని మీసేవ సెంటర్లను ప్రభుత్వం ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రూ.50కి బదులు ఏకంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ అధికంగానే దండుకుంటున్నారు. ఈ దోపిడీపై అధికారులు ఫోకస్ పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

Tags

Next Story