Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావుకు ప్రొక్వెయిమ్డ్ అఫెండర్ నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 28వ తేదీలోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. హాజరు కాని పక్షంలో ఆయన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు సహ కరించకుండా అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యూలర్, రెడ్ కార్నర్, పాస్ పోర్టు రద్దు సహా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పలు పి టిషన్లలో వెల్లడించారు. దీంతో ఆయనపై నాన్ బెయిల్ వారెంట్ జారీ అయ్యింది. ఆయనను ప్రొక్లెయిమ్ అఫెండర్ గా ప్రకటిం చాలని కోరుతూ జనవరిలో పిటిషన్ దాఖలు చేయగా నాంపల్లి కోర్టు ఆమోదించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదే శాలకు అనుగుణంగా జూన్ 28వ తేదీలోగా హాజరుకాకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులను కోర్టు తన అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులను పోలీసులు జప్తు చేయ నున్నారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు అతికించారు. ఆ తర్వాత బహిరంగంగా ప్ర కటన చేసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com