Rajanna Siricilla : రాజన్న సిరిసిల్ల కలెక్టర్ పై ఎన్‌హెచార్సీ సీరియస్

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈక్రమంలో ఎన్హెస్ఆర్సి తమకున్న అధికారులతో సదరు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేలా చేస్తామని తేల్చిచెప్పింది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ముస్తాబాద్ మండలం వానితాళ్ల గ్రామంలో గత ఏడాది ఆగస్టు 2వ తేదీన అనారోగ్యంతో మంచంపై పడి ఉన్న వృద్ధురాలు పిట్ట రామలక్ష్మి(78)ని వీధి కుక్కలు చంపి తిన్న ఘటన చోటుచేసుకుంది. మంచంపై నిద్రిస్తున్న వృద్ధురాలు రామలక్ష్మిపై వీధి కుక్కలు దాడి చేసి, చంపి తినడంతో పక్క ఇంట్లోనే ఉంటున్న కుమారులు వచ్చి చూసేసరికి ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. వానితాళ్ల గ్రామంలోని కొన్ని కుక్కల నోళ్లకు రక్తం ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై న్యాయవాది ఇమ్మనేని రామారావు ఎనాచారికి ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో న్యాయవాది రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, కలెక్టర్ను పూర్తి నివేదిక ఇవ్వాలని మానవ ' హక్కుల కమిషన్ కోరింది. ఈ ఘటనపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమర్పించిన నివేదిక నిర్లక్ష్య పూరితంగా ఉందని జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు సైతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com